Sridhar: చరిత్రకు దర్పణంగా తెలంగాణ తల్లి
ABN, Publish Date - Dec 09 , 2024 | 11:33 AM
Telangana: తెలంగాణ తల్లి రూపకల్పనపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ మాట్లాడుతుందని అనుకున్నామని.. ఉద్దేశపూర్వకంగానే సభకు దూరంగా ఉన్నారని మంత్రి శ్రీధరన్ బాబు మండిపడ్డారు. రూల్స్‌కు విరుద్ధంగా తాము కూడా సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ ఒక్క రోజు రాజకీయాలు పక్కన పెట్టిన ఆవిష్కరణలో పాల్గొనాలని బీఆర్‌ఎస్ పార్టీ నేతలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: మన చరిత్రకు దర్పణంగా తెలంగాణ తల్లిని రూపొందించామని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar babu) తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ తల్లిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తల్లి రూపకల్పనపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ మాట్లాడుతుందని అనుకున్నామని.. ఉద్దేశపూర్వకంగానే సభకు దూరంగా ఉన్నారని మండిపడ్డారు. రూల్స్‌కు విరుద్ధంగా తాము కూడా సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ ఒక్క రోజు రాజకీయాలు పక్కన పెట్టిన ఆవిష్కరణలో పాల్గొనాలని బీఆర్‌ఎస్ పార్టీ నేతలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
CM Revanth Reddy: తెలంగాణ తల్లిపై వివాదం.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
బతుకమ్మ ఉంటే బాగుండేది: బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ అభిప్రాయపడ్డారు. ‘‘తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం’’ అననారు. అన్ని మారుస్తున్నారని.. అలాగే 317జీవోను కూడా మార్చాలని కోరారు. తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణను గత ప్రభుత్వం చిన్నా భిన్నం చేసిందని ఎమ్మెల్యే పాయల శంకర్ విమర్శలు గుప్పించారు.
రాజకీయాలకు తావివ్వొద్దు: పోచారం
‘‘మేము కూడా తెలంగాణ పోరాటంలో ఉన్నాం. అందరూ హుందాగా ఉండాలి. తెలంగాణ తల్లి రూపకల్పన అభినందనీయం’’ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. రాజకీయాలకు తావివ్వొద్దన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనను ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
మనోజ్‌పై దాడి జరిగిందంటూ రిపోర్ట్..
సీఎం కీలక ప్రకటన..
అంతకు ముందు.. అసెంబ్లీలో తెలంగాణ తల్లిపై చర్చకు ప్రతిపాదన చేసిన సీఎం రేవంత్.. తెలంగాణ తల్లి విగ్రహంపై కీలక ప్రకటన చేశారు. సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అని.. 4 కోట్ల ప్రజలను ఏకం చేసి నడిపించిన తల్లి తెలంగాణ తల్లి అని అన్నారు. అలాంటి తల్లి రూపాలు ఇప్పటికే జన బాహుళ్యంలో ఉన్నాయన్నారు. వాటికి ఇప్పటికీ అధికారికంగా గుర్తింపు లేదని తెలిపారు. మన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టి పడేలా తెలంగాణ తల్లిని రూపొందించామని చెప్పుకొచ్చారు. చరిత్రకు దర్పంగా పీఠాన్ని రూపొందించామన్నారు. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
కోదండరాం ఏమన్నారంటే..
కాగా.. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం చారి అనే వ్యక్తి తయారు చేశారన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లి - ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్న తెలంగాణ తల్లి ఒకేలా ఉన్నాయన్నారు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఆయన సొంత నిర్ణయమని తెలిపారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించలేదన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహంపై అన్ని వర్గాల ప్రజల మధ్య చర్చ జరిగిందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని... ట్రోల్ చేసే వాళ్లకు చరిత్ర తెలియదన్నారు. తెలంగాణ తల్లి బొమ్మపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెపుతారన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొంత మంది బతుకమ్మ ఆడరన్నారు. బతుకమ్మ ఉండాలా వద్దా అనే అంశాలపై చర్చ జరుగుతోందని కోదండరాం తెలిపారు.
ఇవి కూడా చదవండి...
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదే
ఎస్సై ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వీడియో విడుదల.
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 09 , 2024 | 11:44 AM