ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు.. భూకబ్జా ఆరోపణలపై ఎంపీ సంతోష్

ABN, Publish Date - Mar 24 , 2024 | 08:20 PM

షేక్‌పేట భూకబ్జా ఆరోపణలపై ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసే వారిపై చట్టప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో ఆదివారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే.

హైదరాబాద్: షేక్‌పేట భూకబ్జా ఆరోపణలపై ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసే వారిపై చట్టప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో ఆదివారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే. దీనిపై స్పందించిన సంతోష్.. తాను భూకబ్జాకు పాల్పడలేదని అన్నారు.

తాను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని చెప్పారు. 32 సంవత్సరాలుగా లేనిదే ఇప్పుడే వివాదంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసని ఆరోపించారు. తనకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యాంసుందర్ ఆ భూమిని 1992లో సేల్ డీడ్ నంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేశారన్నారు. అప్పటినుంచి ఎలాంటి న్యాయవివాదాలు లేవని ఆయన తనకు స్పష్టంగా తెలియజేశారని వివరించారు.

"నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. శ్యాంసుందర్ అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయి. నాకు అమ్మిన వ్యక్తి 32 సంవత్సరాలుగా టచ్‌లోనే ఉన్నారు.


ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు ఇవ్వాలి. వివరణ అడగాలి. కానీ అలాంటివేమీ లేకుండా ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఇంటి స్థలం 1,350 గజాలు అని పోలీసులు చెబుతున్నారు. కానీ నేను కొన్నది 904 గజాల స్థలం. దీనిని బట్టి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు అని స్పష్టంగా అర్థమవుతుంది.

Meta: మెటా నుంచి బ్లాస్టింగ్ ఫీచర్.. ఏఐ ఇమేజ్‌లు ఇక వాట్సప్‌లోనే

రూ.3.81 కోట్లు చెల్లించి బాజాప్తా డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో సైతం ఆ స్థలం వివరాలు వివరించాను. నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు. ఆ భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. మా పార్టీపై, నాపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాను" అని సంతోష్ హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 08:21 PM

Advertising
Advertising