40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaddar Awards: గద్దర్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన.. ఇక నుంచి..

ABN, Publish Date - Jan 31 , 2024 | 08:05 PM

Gaddar Award: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కళాకారులకు ఇచ్చే నందీ అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును ఇక నుంచి గద్దర్ అవార్డుగా అందజేయడం జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Gaddar  Awards: గద్దర్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన.. ఇక నుంచి..
Nandi Award to Gaddar Awards

Gaddar Award: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కళాకారులకు ఇచ్చే నందీ అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును ఇక నుంచి గద్దర్ అవార్డుగా అందజేయడం జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. నందీ అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందజేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. మరిన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. అవేంటో ఓసారి చూద్దాం..

రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధ నౌక జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది కూడా గద్దరే అని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తమకు స్ఫూర్తి అని, ఆయనతో మాట్లాడితే తమకు వెయ్యేనుగుల బలం వచ్చేదన్నారు.

ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి.. ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్‌గా మార్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారో.. తమ ప్రజా ప్రభుత్వంలో అదే దళితుడి వద్దకే వచ్చి ఎమ్మెల్సీ కవిత పూలే విగ్రహం కోసం వినతి పత్రం ఇచ్చారని పేర్కొన్నారు. ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు.. శపనార్ధాలు పెడుతున్నారని ఈ సందర్భంగా విమర్శించారు.

అది వారికే మంచిది కాదు..

ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారని అన్నారు. అది వాళ్ల ఒంటికి.. ఇంటికి మంచిది కాదని హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని, ఐదేళ్లు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

గద్దర్ అవార్డులు..

తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ఈ వేదికగా చెబుతున్నా.. ఇదే శాసనం.. ఇదే జీవో.. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తాం..’ అని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

Updated Date - Jan 31 , 2024 | 09:44 PM

Advertising
Advertising