ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telugu University: తెలుగు వర్సిటీ వీసీగా నిత్యానందరావు బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Oct 21 , 2024 | 08:11 AM

తెలుగు యూనివర్సిటీ వీసీగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని వర్సిటీలో ఆయన 12వ వీసీగా బాధ్యతలు చేపట్టారు.

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు యూనివర్సిటీ వీసీగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని వర్సిటీలో ఆయన 12వ వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నిత్యానందరావు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. సిబ్బంది సహకారంతో వర్సిటీని ప్రగతిపథం వైపు తీసుకెళ్లేలా శ్రమిస్తానని అన్నారు. ఎందరో ప్రముఖులు గురుస్థానంలో ఉన్న వర్సిటీకి వీసీగా నియామకం కావడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. కాగా, నూతన వీసీకి రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు రెడ్డి శ్యామల, భూక్యా బాబురావు, కోట్ల హన్మంతరావు, జగదీష్‌, రత్నశ్రీ, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 08:11 AM