TG News: యాక్షన్ మూవీని తలపించేలా చేజింగ్.. ఫైటింగ్
ABN, Publish Date - Dec 07 , 2024 | 11:27 AM
Telangana: నల్గొండ జిల్లాలో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై జరిగిన చేజింగ్,ఫైటింగ్ యాక్షన్ మూవీని తలపించింది. ఓ దొంగ హయత్‌నగర్‌లో అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేశాడు. ఆపై ఆ వాహనాన్ని తీసుకుని విజయవాడ వైపు పారిపోయేందుకు యత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అలర్ట్ అయి.. దొంగను పట్టుకునేందుకు హైవేపై కాపుకాజారు.
నల్గొండ, డిసెంబర్ 7: సాధారణంగా సినిమాలల్లో దొంగలను పట్టుకునే సీన్లను వెరైటీగా చిత్రీకరిస్తుంటారు దర్శకులు. డబ్బులు, వాహనాల చోరీ ఇలా ఏదైనా దొంగతనానికి సంబంధించిన సీన్లను దర్శకులు ఎంతో హైలెట్‌గా తీస్తుంటారు. దొంగలను పట్టుకోవడం కోసం పోలీసులు చేసే చేజింగ్‌లు... ఫైటింగ్ సీన్లు ప్రేక్షకులను ఉత్కంఠ రేపుతుంటాయి. ఇది సినిమా కాబట్టి ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. కానీ రియల్‌గా కూడా కొందరు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతుంటారు.
Ponguleti: అక్కడకు వెళ్లాలని బాగా ఆత్రుతగా ఉందా.. కేటీఆర్‌పై పొంగులేటి సెటైర్
వారిని చేజింగ్ చేసి అవసరమైతే ఫైటింగ్ కూడా చేస్తుంటారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చేస్తే ధైర్యసాహసాలు హైలెట్‌గా నిలుస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దొండగుడిని పట్టుకునేందుకు మూవీ రేంజ్‌లో చేజింగ్, ఫైటింగ్ చేశారు పోలీసులు. ఈక్రమంలో ఓ పోలీసు ప్రాణాలపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆ దొంగ. ఇంతకీ ఏం జరిగింది... దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు. గాయపడ్డ పోలీసు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
నల్గొండ జిల్లాలో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై జరిగిన చేజింగ్,ఫైటింగ్ యాక్షన్ మూవీని తలపించింది. ఓ దొంగ హయత్‌నగర్‌లో అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేశాడు. ఆపై ఆ వాహనాన్ని తీసుకుని విజయవాడ వైపు పారిపోయేందుకు యత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అలర్ట్ అయి.. దొంగను పట్టుకునేందుకు హైవేపై కాపుకాశారు. అయితే హయత్‌నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను సదరు దొంగ ముప్పు తిప్పలు పెట్టాడు. అంబులెన్స్ సైరన్‌తో రయ్ రయ్ మంటూ అతి వేగంతో దొంగ ప్రయాణం చేశాడు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్
కాగా... చిట్యాల వద్ద అంబులెన్స్‌ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి మరీ దొంగ పారిపోయాడు. అంబులెన్స్ ఢీకొనడంతో జాన్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఎక్కడా ఆగకుండా దొంగ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్‌ను కూడా ఢీకొట్టి పారిపోయాడు. చివరకు దొంగ పాపం పండి పోలీసులకు చిక్కాడు. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి మరీ దొంగను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దొంగను పట్టుకునేందుకు పోలీసులు చూపిన ధైర్యసాహసాలపై అభినందలను వెల్లువెత్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
CM REVANTH REDDY: అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలుపుతా
Hyderabad: హైదరాబాద్‌ను దేశ 2వ రాజధానిగా ప్రకటించాలి..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 07 , 2024 | 11:29 AM