Prajavani: మొదలైన ప్రజావాణి.. భారీగా తరలివస్తున్న ప్రజలు
ABN, Publish Date - Jan 09 , 2024 | 10:56 AM
Telangana: పూలే ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 9: పూలే ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది.
తెల్లవారుజాము నుంచే ప్రజలు ప్రజాభవన్‌కు క్యూ కడతున్నారు. తాము ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. త్వరితగతిన తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిన్నటి (సోమవారం) నుంచి ప్రారంభమైంది. అలాగే ఈనెల 22 నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరుగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 09 , 2024 | 11:29 AM