కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manoj Soni: యూపీఎస్సీకి ఇంతవరకు అవినీతి మ‌ర‌క అంట‌లేదు

ABN, Publish Date - Jan 05 , 2024 | 10:44 PM

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్‌కు (యూపీఎస్సీ) సుమారు వందేళ్ల చ‌రిత్ర ఉంది.. సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు నిర్ధిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్‌, ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం.. అన్నింటా పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోందని యూపీఎస్సీ చైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని ( Manoj Soni ) పేర్కొన్నారు. కాగా ఈ విష‌యంలో తాము యూపీఎస్సీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ ( టీఎస్పీఎస్సీని)ను ఆ విధంగానే రూపొందించాల‌ని తాము నిర్ణ‌యించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) మ‌నోజ్ సోనికి తెలిపారు.

Manoj Soni: యూపీఎస్సీకి ఇంతవరకు అవినీతి మ‌ర‌క అంట‌లేదు

న్యూఢిల్లీ: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్‌కు (యూపీఎస్సీ) సుమారు వందేళ్ల చ‌రిత్ర ఉంది.. సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు నిర్ధిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్‌, ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం.. అన్నింటా పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోందని యూపీఎస్సీ చైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని ( Manoj Soni ) పేర్కొన్నారు. కాగా ఈ విష‌యంలో తాము యూపీఎస్సీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ ( టీఎస్పీఎస్సీని)ను ఆ విధంగానే రూపొందించాల‌ని తాము నిర్ణ‌యించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) మ‌నోజ్ సోనికి తెలిపారు. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో యూపీఎస్సీ చైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని, కార్య‌ద‌ర్శి శ‌శిరంజ‌న్ కుమార్‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టీఎస్పీఎస్సీని ప్ర‌క్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌ని తీరుపై సుమారు గంట‌న్న‌ర పాటు వారు చ‌ర్చించారు. యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంద‌ని, అవినీతి మ‌ర‌క అంట‌లేద‌ని, ఇంత సుదీర్ఘ‌కాలంగా అంత స‌మ‌ర్థంగా యూపీఎస్సీ ప‌ని చేస్తున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. తెలంగాణ‌లో నియామ‌క ప్ర‌క్రియ‌లో నూత‌న విధానాలు, ప‌ద్ధ‌తులు పాటించాల‌నుకుంటున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. స్పందించిన యూపీఎస్సీ చైర్మ‌న్ యువ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నియామ‌కాల ప్ర‌క్రియ‌పై దృష్టి సారించ‌డం అభినంద‌నీయ‌మ‌ని చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కంలో రాజ‌కీయ ప్ర‌మేయం ఉండ‌ద‌ని, స‌మ‌ర్థత ఆధారంగా ఎంపిక ఉంటుంద‌ని యూపీఎస్సీ చైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని తెలిపారు.


బీఆర్ఎస్ రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చింది: సీఎం రేవంత్‌రెడ్డి

తాము 2024 డిసెంబ‌రు నాటికి రెండు ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్నామ‌ని, ఇందుకు టీఎస్పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేయాల‌నుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చైర్మ‌న్ మ‌నోజ్ సోని దృష్టికి తీసుకెళ్లారు. గ‌త ప్ర‌భుత్వం టీఎస్పీఎస్సీ చైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కాన్ని రాజ‌కీయం చేసి, దానినో రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చింద‌న్నారు. ఫ‌లితంగా పేప‌ర్ లీకులు, నోటిఫికేష‌న్ల జారీ, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఫ‌లితాల వెల్ల‌డి ఓ ప్ర‌హ‌స‌నంగా మారింద‌న్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌యింద‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం, అస‌మ‌ర్ధ‌త‌తో నియామ‌కాల విష‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్యం చోటు చేసుకుంద‌న్నారు. తామ రాజ‌కీయ ప్ర‌మేయం లేకుండా చైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కం చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీలో అవ‌క‌త‌వ‌ల‌కు తావులేకుండా సిబ్బందిని శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తామ‌ని వివ‌రించారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మ‌న్ టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ త‌ర‌హాలో తీర్చిదిద్దాల‌నుకుంటున్నందున టీఎస్పీఎస్సీ చైర్మ‌న్‌తో పాటు స‌భ్యుల‌కు తాము శిక్ష‌ణ ఇస్తామ‌ని, స‌చివాల‌య సిబ్బందికి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, రాష్ట్ర మ‌హిళా, శిశుసంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి వాణీ ప్ర‌సాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 10:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising