ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Road Accident: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి..

ABN, Publish Date - Feb 14 , 2024 | 07:50 AM

హైదరాబాద్: ఎల్బీనగర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల సీఐ ప్రాణాన్ని బలికొంది. కారు యూటర్న్ తీసుకుంటూ.. రాంగ్ రూట్‌లో వెళ్లగా ఆ రహదారిలో వస్తున్న బైక్ కారును ఢీ కొట్టింది.

హైదరాబాద్: ఎల్బీనగర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్.. సీఐ ప్రాణాన్ని బలికొంది. కారు యూటర్న్ తీసుకుంటూ రాంగ్ రూట్‌లో వెళ్లగా అటుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వస్తున్న చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ సీఐ సాదిక్ అలీ చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఖాజావలీ మోహినుద్దీన్‌గా గుర్తించారు. సీఐ సాదిక్ అలీ, ఎస్ఐ ఖాజావలీ మోహినుద్దీన్ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లి మలక్‌పేట్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా ఎల్బీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. వినుషా శెట్టి పేరుపై కారు రిజిస్ట్రేషన్ ఉంది. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ చలాన్స్ కూడా ఉన్నాయి. అర్ధరాత్రి ప్రమాదం తర్వాత కారును స్పాట్‌లో వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 14 , 2024 | 09:29 AM

Advertising
Advertising