ఆర్టీఐ చీఫ్ కమిషనర్.. ఆర్టీఐ కమిషనర్ల భర్తీకి నోటిఫికేషన్
ABN, Publish Date - Jun 12 , 2024 | 04:34 AM
సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్, కమిషనర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ సంబంధిత ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం జారీ చేశారు.
చీఫ్ కమిషనర్, కమిషనర్ పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం.. 29 వరకు గడువు
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్, కమిషనర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ సంబంధిత ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం జారీ చేశారు. సమాచార హక్కు చట్టం-2005లోని సెక్షన్లు 15, 16 ప్రకారం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జత పర్చాలని పేర్కొంది. దరఖాస్తులను httpe;//telangana.gov.in వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని తెలిపింది. 2023 జూలై 4న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వివరించింది.
Updated Date - Jun 12 , 2024 | 08:03 AM