Shikha Goel: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అలర్ట్‌గా ఉండాలి: శిఖా గోయల్
ABN, Publish Date - Jan 24 , 2024 | 10:02 AM
హైదరాబాద్: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫేక్ ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని...
హైదరాబాద్: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫేక్ ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని, అయోధ్య రామ మందిర్‌కు ఉన్న ప్రాముఖ్యత దృశ్య భక్తులెవరు మోసపోవద్దని సూచించారు. ప్రసాదం డెలివరీ, విరాళాల సేకరణ పేరుతో ఏదైనా క్యూఆర్ కోడ్ పంపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. అయోధ్య పేరుతో నకిలి వెబ్‌సైట్లు కూడా క్రియేట్ చేస్తున్నారని, అయోధ్య రామ మందిర్ నుంచి ఎలాంటి లింకులు వచ్చిన వాటిని క్లిక్ చేయవద్దన్నారు. అలాంటి లింకులు కనిపిస్తే 8712672222 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని శిఖా గోయల్ అన్నారు.
Updated Date - Jan 24 , 2024 | 10:02 AM