BRS: ఎలాంటి నోటీస్ అందలేదు: బీఆర్ఎస్ పార్టీ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ABN, Publish Date - Jan 04 , 2024 | 08:59 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తనకు ఎలాంటి నోటీస్ అందలేదని చెప్పారు. గతంలోనే ఓసారి అధికారులు నోటీస్ ఇచ్చారని, త్వరలోనే ఛానల్ ఆఫీస్ తరలింపుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పామన్నారు. కాగా 2004లో వైఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించింది. 2006 ఆగస్టు 14న పీఎంకే అధినేత రామ్ దాస్ చేతుల మీదుగా తెలంగాణ భవన్ ప్రారంభమైంది. కాగా పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు నోటీసులు ఇచ్చారు.
Updated Date - Jan 04 , 2024 | 08:59 AM