ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Assembly: తెలంగాణ అసెంబ్లీలో అప్పులపై రగడ.. నేతల మధ్య మాటల యుద్ధం

ABN, Publish Date - Dec 17 , 2024 | 11:24 AM

Telangana: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అప్పులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎఫ్‌ఆర్‌బీఎమ్ రుణాలపై మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని భట్టి తెలిపారు.

Telangana Assembly session

హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly Session) కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అప్పులపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎఫ్‌ఆర్‌బీఎమ్ రుణాలపై సభలో రగడ చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం అసెంబ్లీ మొదలవగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌బీఎమ్ రుణాలపై మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti Vikramarka) సమాధానం ఇచ్చారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని భట్టి తెలిపారు. అయితే భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై హరీష్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Year End 2024: ఈ ఏడాదిలో ఏపీలోనే సెన్సేషనల్ కేసు ఇది..


రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది అవాస్తవమన్నారు. రూ.51 వేల కోట్ల అప్పు చేశామని ఒప్పుకున్నారన్నారు. ఇవాళ మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకున్నారని.. ఒక్క ఏడాదిలో లక్షా 27వేల కోట్ల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పుకొచ్చారు. గోరంతను కొండత చేసి గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు. ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్‌ పార్టీకి అపారమైన అనుభవం ఉందని.. హామీలను నెరవేర్చడమం పెద్ద సమస్యే కాదని ఎన్నికల ముందు భట్టి విక్రమార్క చెప్పారని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చాక ఏడాది అయింది హామీలు నెరవేర్చమని అడిగితే అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం అంతా తప్పు అని సభ ద్వారా చెబుతున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.


భట్టి సవాల్.. సిద్ధమన్న హరీష్

అయితే హరీష్‌ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు. భట్టి సవాల్‌ను స్వీకరిస్తున్నామని.. అప్పులపై చర్చకు సిద్ధమని హరీష్ రావు ప్రకటించారు.

టీడీపీలో ‘జోగి’ రచ్చ


ప్రివిలేజ్ మోషన్‌పై

మరోవైపు రేవంత్ ప్రభుత్వంపై తాము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ అనుమతించాలని సభలో హరీష్ రావు కోరారు. ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సమావేశాలు ముగిసేలోపైనా అప్పులపై చర్చించాలని పట్టుబడ్డారు. ప్రభుత్వం చెప్తున్న అప్పులకు, వాస్తవ అప్పులకు తేడా ఉందని హరీష్‌ రావు స్పష్టం చేశారు.


బీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై భట్టి మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ సభ్యులా మాపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది. బీఏసీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. గడిచిన పదేళ్లు బీఏసీ ఎలా నిర్వహించారో మర్చిపోయారా? గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడూ పాటించాలి కదా ఎవరైనా రూల్స్ బుక్ ప్రకారమే నడవాలి’’ అని మంత్రి భట్టి వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక విధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు నీతులు మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. ఆ బిల్లులు పెండింగ్‌లో పెట్టింది బీఆర్ఎస్ అని వ్యాఖ్యలు చేశారు. 40 వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని తెలిపారు. ప్రతి గింజా తామే కొంటామని సివిల్ సప్లయ్‌లో 18 వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. హరీష్ రావుకు ఎప్పుడు నిజాలు మాట్లాడే అలవాటు లేదని.. హరీష్ రావు అబద్ధాలు చెబితే అలవాటులో పొరపాటు అనుకున్నామన్నారు. శాసనసభ వ్యవహారాల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ‘‘ అప్పుల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. చేసిన అప్పులను దాచే పరిస్థితి లేదు. నిజాలు చెప్తే ప్రివిలేజ్ మోషన్ అంటే ఊరుకోవాలా? ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మైండ్ పోతుంది. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించిన వాళ్లలో మార్పు రావడం లేదు. అప్పులు ఆస్తుల విషయంలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హరీష్ రావు సవాళ్లు స్వీకరిస్తున్నాను చర్చకు నేను రెడీ’’ అని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


నల్లచొక్కాలతో అసెంబ్లీకి బీఆర్‌ఎస్...

మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు నల్ల చొక్కాలు, చేతులకు బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు బేడీలు వేసినందుకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు. రైతులకు బేడీలు వేస్తారా అంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.


ఇవి కూడా చదవండి...

BRS: అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్

BRS: తండ్రీకొడుకులకు ఝలక్‌ కేసీఆర్‌పై కేసు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 11:38 AM