ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana: వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

ABN, Publish Date - Jan 10 , 2024 | 06:33 PM

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ చలాన్స్ చెల్లింపునకు గడువును పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31వ తేదీ వరకు డిస్కౌంట్ చలాన్ కట్టేందుకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Discount Traffic Challans

హైదరాబాద్, జనవరి 10: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ చలాన్స్ చెల్లింపునకు గడువును పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31వ తేదీ వరకు డిస్కౌంట్ చలాన్ కట్టేందుకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వాస్తవానికి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. నేటితో ఆ గడువు ముగియగా.. ఈ రోజు వరకు రూ. 107 కోట్ల చలాన్లు వసూళు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా చాలా మంది ప్రజలు తమ వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్స్ చెల్లించాల్సి ఉంది. లాస్ట్ డేట్ కావడంతో అందరూ ఒకేసారి ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. దాంతో సైట్ స్లో అయ్యింది. దీంతో పెండింగ్ చలాన్స్ చెల్లించేందుకు గడువు పొడిగించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం పెండింగ్ చలాన్ చెల్లింపునకు గడువును జనవరి 31వరకు పొడిగించింది. దీంతో వాహనదారులు హమ్మయ్య అనుకున్నారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటి వరకు 1.05 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఇవాళ్టి వరకు రూ. 107 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇంకా చాలా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు అధికారులు. పెంచిన గడువుతో అవి కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. కాగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2022 లో మార్చి 1 నుంచి 31 వరకు చలాన్ల చెల్లింపునకు డిస్కౌంట్స్ ఇచ్చింది. గడువు ముగిసిన తరువాత మరో 15 రోజుల పాటు గడువు పొడిగించింది.

Updated Date - Jan 10 , 2024 | 06:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising