Sankranti Holidays: సంక్రాంతి సెలవు ప్రకటించిన సర్కార్.. ఎన్నిరోజులంటే..
ABN, Publish Date - Jan 04 , 2024 | 05:17 PM
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లు సెలవులు ప్రకటించింది. తిరిగిన 18వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. అంటే మొత్తం ఆరు రోజుల పాటు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లు సెలవులు ప్రకటించింది. తిరిగిన 18వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. అంటే మొత్తం ఆరు రోజుల పాటు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ సర్క్యూలర్ జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయి. ప్రైవేట్ స్కూల్ సెలవులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అధికారులు.
జనవరి 12న సాధారణ సెలవు కాగా, 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీన భోగి, 15న సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగ ఉన్నాయి. 17న సాధారణ సెలవు ఇచ్చారు. మొత్తంగా ఆరు రోజులు సెలవులు ఇచ్చారు. ఇక జనవరి 29వ తేదీ నుంచి స్కూల్ విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్-4 పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ.
కాలేజీలకు సెలవులు ఎప్పటినుంచంటే..
స్కూళ్లతో పాటు.. ఇంటర్మీడియట్ కాలేజీలకూ సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ దీనిని పాటించాలని ఆదేశించారు అధికారులు. ఇక జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Updated Date - Jan 04 , 2024 | 05:17 PM