ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అధికారులను వెనక్కి పంపిస్తున్న మూసీ ప్రజలు.. తీవ్ర ఉద్రిక్తత..

ABN, Publish Date - Sep 27 , 2024 | 11:42 AM

ఆపరేషన్ మూసీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. మొదటి విడతలో రివర్ బెడ్‌లో, రెండవ విడతలో బఫర్ జోన్‌లో నిర్మాలను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సర్వేను ప్రారంభించగా మూసీ నివాసితులు అడ్డు తగులుతున్నారు. వరుసగా రెండవ రోజు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వేను కొనసాగిస్తున్నారు. అయితే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు.

హైదరాబాద్: ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు రెండవ రోజు కూడా నిరసనలు తెలుపుతున్నారు. దీంతో మూసి నివాసితుల ప్రాంతాల్లో రెండవ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వేను కొనసాగిస్తున్నారు. అయితే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను వెనక్కి పంపిస్తున్నారు. కొత్తపేట మారుతి నగర్‌లో మూసీ సర్వే నిలిచిపోయింది. ఇక మూసీ బాధితులకు ఎల్‌బీ నగర్ బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. బాధితుల ఆందోళనలకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు.

పెట్రోల్ పోసుకున్న యువకుడు..

అధికారులను సర్వేను అడ్డుకుంటూ ఓ యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోలీసుకున్నాడు. తన భార్య 9 నెలల గర్భిణీ అని, తన ఇళ్లు కూల్చివేస్తారంటూ అతడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కొత్తపేట్‌లో ఈ ఘటన జరిగింది.


నిన్న మూసీ సర్వే ఉద్రిక్తం

మూసీ నదీగర్భం (రివర్‌ బెడ్‌) పరిధిలోని నిర్మాణాలకు మార్కింగ్‌ చేసే ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. గురువారం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వే విభాగానికి చెందిన అధికారులు ఈ సర్వే చేపట్టారు. మూసీ రివర్‌ బెడ్‌లో ఉన్న ఇళ్లు, వాటి యాజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చైతన్యపురి ఫణిగిరి కాలనీ, వెంకటసాయినగర్‌ కాలనీ, న్యూ మారుతీ నగర్‌, సత్య నగర్‌లో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయనివ్వబోమన్నారు. ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అని నినాదాలు చేశారు.


ఇవి కూడా చదవండి

జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ

రఘురామ కేసులో కీలక పరిణామం

Updated Date - Sep 27 , 2024 | 11:55 AM