CM Revanth: లగచర్ల రైతుకు బేడీపై సీఎం రేవంత్ సీరియస్
ABN, Publish Date - Dec 12 , 2024 | 02:56 PM
Telangana: లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులను ఆరా తీశారు సీఎం. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 12: లగచర్ల రైతుకు బేడీల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలను సహించేదిలేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Mohanbabu: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ప్రధాన నిందితుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే కలెక్టర్‌పై దాడికి పాల్పడిన కొందరు లగచర్ల రైతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో రైతు హీర్యానాయక్ ఒకరు. ఈ రైతు ప్రస్తుతం కంది సెంట్రల్ జైలులో ఉన్నాడు. అయితే గత రాత్రి(బుధవారం) హీర్యాకు ఛాతిలో నొప్పి రావడంతో అతడిని జైలు అధికారులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈరోజు కూడా మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం హీర్యానాయక్‌ను సంగారెడ్డి జనరల్ ఆస్పత్రికి జైలు అధికారులు తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో హీర్యా నాయక్ చేతికి బేడీలు ఉన్నాయి. బేడీలతోనే హీర్యానాయక్‌ను పోలీసులు సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అంతేకాకుండా బేడీలతో రైతుకు చికిత్స అందజేశారు. ఇప్పుడు ఇది రచ్చకు దారి తీసింది. రైతును బేడీలతో ఎలా తీసుకువస్తారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బేడీల అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరడంతో సీఎం సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హీర్యా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై
హీర్యా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. హిర్యనాయక్‌కి రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కంది జైల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు రాత్రే ఈసీజీ తీశాం నార్మల్‌గా ఉందని అన్నారు. ఈరోజు ఉదయం మళ్లీ కొన్ని చెక్ అప్‌ల కోసం ఆస్పత్రికి రమ్మని చెప్పమన్నారు. ఉదయం కూడా 2డీ ఈకో, ఈసీజీతో పాటు మిగతా కొన్ని పరీక్షలు చేశామని.. అన్ని నార్మల్‌గానే ఉన్నాయన్నారు. కార్డియాక్‌వలుషేన్ కోసం గాంధీకి రెఫర్ చేశామని.. ప్రస్తుతం వీర్యనాయక్ స్టేబుల్ గానే ఉన్నారని చెప్పారు.. అయిన కూడా సేఫ్ సైడ్ కోసం, కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం గాంధీకి రిఫర్ చేశామని అన్నారు. ఇప్పటి వరకు తాము చేసిన ఈసీజీ,2డీ ఈకో టెస్టులో అన్ని నార్మల్ గానే ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఆలయంలో పాదం గుర్తు.. పూజలు చేసిన భక్తులు
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 12 , 2024 | 04:22 PM