ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్లీజ్‌.. నా బిడ్డను ఆదుకోండి

ABN, Publish Date - Jun 12 , 2024 | 05:37 AM

అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి బ్లడ్‌ కేన్సర్‌ బారి నుంచి బయట పడిందన్న సంతోషం ఆ కుటుంబానికి ఎంతో కాలం నిల్వలేదు. రోగం తిరగబెట్టడంతో ఆ చిన్నారిని మళ్లీ ఆస్పత్రి పాలైంది. ఇప్పటికే వైద్యానికి లక్షలు ఖర్చుపెట్టిన ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో తన బిడ్డకు మెరుగైన చికిత్స అందించడానికి దాతలు సహకరించాల్సిందిగా వేడుకుంటున్నారు.

  • దాతలకు ఓ తండ్రి వేడుకోలు

  • బ్లడ్‌ కేన్సర్‌ బారిన చిన్నారి

  • ఇప్పటికే వైద్యానికి 55 లక్షల ఖర్చు

  • ఇక భరించలేని దీనస్థితిలో తల్లిదండ్రులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి బ్లడ్‌ కేన్సర్‌ బారి నుంచి బయట పడిందన్న సంతోషం ఆ కుటుంబానికి ఎంతో కాలం నిల్వలేదు. రోగం తిరగబెట్టడంతో ఆ చిన్నారిని మళ్లీ ఆస్పత్రి పాలైంది. ఇప్పటికే వైద్యానికి లక్షలు ఖర్చుపెట్టిన ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో తన బిడ్డకు మెరుగైన చికిత్స అందించడానికి దాతలు సహకరించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఎల్బీనగర్‌లోని రఘు, మంజుల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రఘు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న పెద్దకుమార్తె వేదవల్లికి 2022 నవంబరులో తీవ్ర జ్వరం వచ్చింది. ముంబైలోని టాటా మెమోరియల్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా అక్కడ ఆమెకు బ్లడ్‌ కేన్సర్‌ (అనాప్లాస్టిక్‌ లార్జ్‌ సెల్‌ లార్జ్‌ లింఫోమా) నాల్గో దశలో ఉన్నట్లు తేల్చారు.

దీంతో ఆ చిన్నారికి కీమోథెరపీ, రేడియేషన్స్‌ థెరపీ, బోన్‌మారో మార్పిడి చేసినట్లు తండ్రి రఘు వివరించారు. ఆ తర్వాత ఆమె జబ్బు నుంచి బయట పడిందని సంతోషిస్తున్న సమయంలో రోగం తిరగబెట్టింది. రోజూ విపరీతమైన రక్తస్రావం కావడంతో ప్లేట్‌ లేట్స్‌ గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఆమెను బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి తరలించగా 65 రోజుల నుంచి అక్కడ చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.55 లక్షల వరకు వ్యయం భరించామని, ఇంకా రూ.10-.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని తండ్రి రఘు ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎనగందుల రఘు, యాక్సిస్‌ బ్యాంక్‌, అకౌంట్‌ నంబర్‌ - 008010101942448. ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌: యూటీఐబీ 0001134, ఎల్బీనగర్‌ బ్రాంచ్‌, హైదరాబాద్‌కు సాయం అందించాలని కోరారు. వివరాలకు 9440611760 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.

Updated Date - Jun 12 , 2024 | 05:37 AM

Advertising
Advertising