ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో తోపులాటపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 09 , 2024 | 08:24 PM

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో తోపులాట ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని ఆమె అన్నారు.

Konda Surekha

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో తోపులాట ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని ఆమె అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఇక ఈ తోపులాట ఘటనపై పోలీస్ శాఖ రేపటిలోగా (బుధవారం) నివేదిక సమర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.


కాగా భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో(Balkampeta Yellamma Kalyanam) చిన్నపాటి తోపులాట జరిగింది. దీంతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇబ్బందికి గురయిన విషయం తెలిసిందే. కాగా ప్రోటోకాల్ పాటించలేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అలిగారని, నిరసన వ్యక్తం చేశారంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆలయం బయట ఉన్నారని, అధికారులపై అసహనం వ్యక్తం చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను మంత్రి పొన్న ప్ర గుప్పుమన్నాయి. అయితే దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేశారు. ఈ సంఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 09 , 2024 | 08:24 PM

Advertising
Advertising
<