ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Assembly: మూడో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం

ABN, Publish Date - Feb 12 , 2024 | 10:22 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడోరోజు సోమవారం ప్రారంభమయ్యాయి. దివంగత నేతలు మచిందర్‌రావు, నర్సారెడ్డి, రాజమల్లుకు సభ సంతాపం తెలపనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరిగే అవకాశముంది, దీనిపై ప్రతిపక్షాలు కూడా సిద్ధమయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడోరోజు సోమవారం ప్రారంభమయ్యాయి. దివంగత నేతలు మచిందర్‌రావు, నర్సారెడ్డి, రాజమల్లుకు సభ సంతాపం తెలపనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరిగే అవకాశముంది, దీనిపై ప్రతిపక్షాలు కూడా సిద్ధమయ్యాయి. బడ్జెట్‌పై ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. అలాగే ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్‌ను సర్కార్ సభలో ప్రకటించనుంది. టొబాకో, సిగరెట్ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2023-24 సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్‌పై ఆర్థికమంత్రి ప్రకటన చేయనున్నారు.

అలాగే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నీళ్ల మంటలు చెలరేగనున్నాయి, ప్రాజెక్ట్స్ వార్ పతాకస్థాయికి చేరింది. రేపు ‘చలో నల్లగొండ’కు బీఆర్ఎస్ పిలుపిచ్చింది. అలాగే మంగళవారం ‘చలో కాళేశ్వరం’ కార్యక్రమానికి ప్రభుత్వం పిలుపిచ్చింది. బీఆర్ఎస్‌పై ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే.. ఒప్పుకున్నారని, ఏపీ సీఎంతో కుమ్మక్కై నీటి వాటాను వదిలేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తెలంగాణకు నష్టం చేసే ఒప్పందాలపై.. కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు చేశారని ప్రభుత్వం మండిపడుతోంది. సమగ్ర వివరాలతో అసెంబ్లీలో ఈరోజు శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. గట్టిగా తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ చేసింది. కాగా ఇవాళ్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated Date - Feb 12 , 2024 | 10:25 AM

Advertising
Advertising