TSRTC: అయ్యప్ప భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్ న్యూస్..
ABN, Publish Date - Jan 04 , 2024 | 02:22 PM
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టీఎస్ఆర్టీసీ.
హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టీఎస్ఆర్టీసీ. జనవరి 5వ తేదీ నుంచి ఈ సర్వీస్ మొదలవుతుందని తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ ప్రకటన ప్రకారం.. శబరమల వెళ్లే బస్సు షెడ్యూల్ ఇలా ఉంది.
👉 తొలి రోజు సాయంత్రం 3 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
👉 2వ రోజు సాయంత్రం 7.30 గంటలకు కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ దర్శనం అనంతరం తిరిగి అదే రాత్రి 10.30 గంటలకు బయలుదేరుతుంది.
👉 3వ రోజు ఉదయం 6.30 గంటలకు గురువాయూర్‌కు చేరుకుంటుంది. తిరిగి 12.30 గంటలకు బయలుదేరుతుంది.
👉 4వ రోజు రాత్రి 11.20 గంటలకు ఎరుమెలి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరుతుంది.
👉 4వ రోజు ఉదయం 9.20 గంటలకు పంబ చేరుకుంటుంది. అక్కడి నుంచి మద్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది.
👉 5వ రోజు ఉదయం 5.20 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరిగి 9.20 గంటలకు ప్రారంభమవుతుంది.
👉 5వ రోజు సాయంత్రం 5.30 గంటలకు మధురై చేరుకుంటుంది. తిరిగి 11.20 గంటలకు బయలుదేరుతుంది.
👉 6వ రోజు ఉదయం 7.30 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
👉 6వ రోజు సాయంత్రం 6.10 గంటలకు కంచికి చేరుకుంటుంది. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం 2.10 గంటలకు బయలుదేరుతుంది.
👉 7వ రోజు ఉదయం 11.10 గంటలకు మహానందికి చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 11.30 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి నేరుగా తిరిగి ఎంజీబీఎస్‌కు చేరుకుంటుందని ఆర్టీసీ పేర్కొంది.
ఛార్జీలు ఈ విధంగా..
హైదరాబాద్ నుంచి శబరమల వెళ్లే ప్రతి ప్రయాణికుడికి ఒక్కరికి రూ. 13,600 చొప్పున ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. జనవరి 5వ తేదీన అంటే.. శుక్రవారం నాడు లహరి బస్సు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరనుంది.
Updated Date - Jan 04 , 2024 | 02:23 PM