Bonalu: ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం..
ABN, Publish Date - Jul 21 , 2024 | 08:04 AM
సికింద్రాబాద్: ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు ఆదివారం తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు.
సికింద్రాబాద్: ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు (Ujjaini Mahankali Bonalu) ఆదివారం తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. అలాగే పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అన్ని శాఖల సహకారంతో బోనాలకు ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే వీఐపీలకు ఒకటి.. సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తుల రాకపోకలకు ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కాగా సోమవారం రంగం (భవిష్యవాణి) అంబారీ ఊరేగింపు, మహా హారతి ఉంటుంది.
ట్రాఫిక్ ఆంక్షలు:
ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు నేపథ్యంలో ఆలయ ప్రాంతం రద్దీగా ఉంటుంది. దీంతో పోలీసు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయానికి రెండు కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 21 , 2024 | 08:05 AM