OTS: ఓటీఎస్‌కు ప్రత్యేక యాప్
ABN, Publish Date - Oct 21 , 2024 | 07:17 AM
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల బకాయిలపై ఆలస్య రుసుము, వడ్డీ మాఫీకి తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్–2024) పథకానికి వాటర్‌బోర్డు ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది.
అధికారుల చుట్టూ తిరిగే పనికి చెక్
జరిమానా లేకుండా నీటిబిల్లు చెల్లించే వెసులుబాటు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు20 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల బకాయిలపై ఆలస్య రుసుము, వడ్డీ మాఫీకి తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్–2024) పథకానికి వాటర్‌బోర్డు ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది. ఈ యాప్‌లో వివరాలు పొందుపరిస్తే చాలు.. రాయితీపోను చెల్లించాల్సిన నీటి బిల్లు ఎంతో స్పష్టత రానుంది. యాప్ రూపకల్పన పనులు తుది దశకు చేరాయి. వాటర్‌బోర్డులో పెరిగిపోతున్న నీటి బకాయిలను తగ్గించేందుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ (ఓటీఎస్) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల 19న వాటర్‌బోర్డు లేఖ రాసింది.
అందుకు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఓటీఎస్ కింద.. వినియోగదారులు తమ బకాయిలను ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. అందుకు ఈ నెల చివరి వరకు అవకాశం కల్పించారు. ఓటీఎస్ వర్తింపజేసుకోవడానికి వినియోగదారులు వాటర్‌బోర్డు డివిజన్, సెక్షన్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. బకాయి మొత్తాన్ని బట్టి మేనేజర్‌ను, జనరల్ మేనేజర్‌ను, చీఫ్ జనరల్ మేనేజర్‌ను కలవాల్సి ఉంటుంది.
ఓటీటీ యాప్ అందుబాటులోకి వస్తే అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. యాప్‌లో నీటి వినియోగదారులు తమ క్యాన్ నెంబర్ (నల్లా కనెక్షన్ నెంబర్) పొందుపరిస్తే చాలు.. నీటి బిల్లు వివరాలు వస్తాయి. ఓటీఎస్ కింద మాఫీ అయ్యే వడ్డీ, తొలగించే జరిమానాల వివరాలుంటాయి. రాయితీ తర్వాత చెల్లించాల్సిన నీటి బిల్లు మొత్తం వస్తుంది. దానిని ఆన్‌లైన్‌లో చెల్లిస్తే సరిపోతుంది.
Updated Date - Oct 21 , 2024 | 07:17 AM