ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sharmila: నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల

ABN, Publish Date - Jan 09 , 2024 | 07:52 AM

హైదరాబాద్: వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌కు రానున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డ్‌ను గవర్నర్ తమిళి సైకు ఇవ్వనున్నారు.

హైదరాబాద్: వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌కు రానున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డ్‌ను గవర్నర్ తమిళి సైకు ఇవ్వనున్నారు. కాగా షర్మిల తనయుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం చేసేందుకు వైఎస్‌ కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

అలాగే ఏపీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఐదు రోజుల క్రితం వైఎస్ షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్‌కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. అరగంట పాటు భేటీ అయ్యారు. జగన్, వదిన భారతీలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల తప్పకుండా రావాలని ఆహ్వానించారు.

Updated Date - Jan 09 , 2024 | 07:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising