ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెండింగ్‌ వేతనాలు ఇవ్వకుంటే సమ్మె తప్పదు

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:26 AM

: కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న ఉద్యోగుల పెండింగ్‌ వేతనాలు ఇవ్వకుంటే సమ్మె తప్పదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి హెచ్చరించారు.

సమ్మె నోటీసు అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకుడు దేవేందర్‌రెడ్డి

నల్లగొండ రూరల్‌, మార్చి 21: కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న ఉద్యోగుల పెండింగ్‌ వేతనాలు ఇవ్వకుంటే సమ్మె తప్పదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌ మంజులతకు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని అనేక మార్లు విన్నవించుకున్న పట్టించు కోవడం లేదన్నారు. సుమారు 78 క్యాడెర్లలో 17,514 మంది పనిచేస్తున్నారన్నారు. చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను పొసించ లేక పోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్‌ జిల్లా నాయకులు రాయల గీతా రాణి, చిత్రం సరిత, లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:26 AM

Advertising
Advertising