ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ట్యాపింగ్‌ జరిగి ఉంటే.. కేసీఆరే బాధ్యుడా?

ABN, Publish Date - Apr 04 , 2024 | 05:55 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ లీకువీరుడు అని, ఫోన్‌ ట్యాపింగ్‌లో వాళ్లున్నారు, వీళ్లున్నారంటూ లీకులిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. లీకు

పోలీసు అధికారులు రవిగుప్తా, శివధర్‌రెడ్డి,

మహేందర్‌రెడ్డిల ప్రమేయం ఉండదా?

ట్యాపింగ్‌ చేయాల్సిన అగత్యం మాకు లేదు

హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ లీకువీరుడు

ఆధారాలు బయటపెట్టే దమ్ములేక లీకులు

అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంనూ వదల

తప్పుడు ప్రచారాలను లీగల్‌గా ఎదుర్కొంటా

కడియం, దానం పదవులు పోవడం ఖాయం

రేవంత్‌ మగాడైతే రుణమాఫీ చేయాలి

రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం

రాష్ట్రానికి ఏంచేశారని బీజేపీకి ఓటెయ్యాలి?

రేవంత్‌ గుంపు మేస్త్రీ.. మోదీ తాపీ మేస్త్రీ

బీఆర్‌ఎస్‌కు బీజేపీతోనే పోటీ: కేటీఆర్‌

సురేఖ, యెన్నం, మహేందర్‌రెడ్డికి నోటీస్‌లు

హైదరాబాద్‌/వికారాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ లీకువీరుడు అని, ఫోన్‌ ట్యాపింగ్‌లో వాళ్లున్నారు, వీళ్లున్నారంటూ లీకులిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. లీకు వీరునికి ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పే దమ్ము లేదని, నేరుగా ప్రజల ముందు ఆధారాలు బయటపెట్టే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. విచారణలో ఏముందో విషయం, ఎవరికీ తెలియదని, కానీ.. పోలీస్‌ రిమాండ్‌ ఉన్నవారి విషయాలు కూడా మీడియాకు లీకులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా ట్యాపింగ్‌ జరిగి ఉంటే.. దానికి కేసీఆర్‌ను మాత్రమే బాధ్యుడిని చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారంలో పార్టీలు మారినా.. అధికారులు మారలేదని, ప్రస్తుత డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నారని, మరి అందులో ఈ అధికారుల ప్రమేయం ఉండదా? అని నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘హీరోయిన్లను నేను బెదిరించానని ఓ మంత్రి అంటున్నారు. ఆ మంత్రికి తలకాయ ఉందో లేదో తెలియదు. అటువంటి దిక్కుమాలిన పని చేయాల్సిన అవసరం నాకు లేదు’’ అని స్పష్టం చేశారు. ఇల్లీగల్‌ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అడ్డదిడ్డమైన మాటలు, చెత్త ఆరోపణలు చేస్తే.. మంత్రి అయినా.. ముఖ్యమంత్రి అయినా వదలబోనని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని లీగల్‌గా తాట తీస్తామని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 2011లో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీల ఫోన్లు ట్యాప్‌ చేశారని అప్పట్లో కాంగ్రెస్‌ నేతలు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌ ఆరోపించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014లో వచ్చిందని, సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందేమో తీయాలని, అప్పటి నుంచి ఏ కుంభకోణాలు జరిగాయో తేల్చాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్నపుడు తన యాపిల్‌ ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు సందేశం పంపారని వెల్లడించారు. హామీలు నెరవేర్చలేక.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటివి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలా ఎన్ని రోజులు గడుపుతారని ప్రశ్నించారు.

కడియం, దానం పదవులు ఊస్టింగే

ఒక పార్టీ గుర్తుతో గెలిచి.. మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను మూడు నెలల్లోగా అనర్హులుగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల పదవి మూడు నెలల్లో ఊడిపోవడం గ్యారెంటీ అని, తొందర్లోనే ఖైరతాబాద్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక రావడం తథ్యమని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రె్‌సకు 40 సీట్లు దాటవని తాను అనలేదని, ఇండియా కూటమికి చెందిన మమతా బెనర్జీయే అన్నారని గుర్తు చేశారు. ప్రతిసారీ మొగోడివైతే అని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. నిజంగా మగాడైతే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందని, ప్రజల గొంతెండిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రె్‌సకు ఓట్లు వేయనందుకు హైదరాబాద్‌ నగరంపై రేవంత్‌రెడ్డి కక్షగట్టారని, అందుకే ప్రాజెక్టుల్లో నీళ్లున్నా తాగునీరు అందించడం లేదని అన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని ఎందుకు సరఫరా చేయాల్సి వస్తోందో సీఎం చెప్పాలన్నారు. కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో నీళ్లున్నా.. దాచిపెట్టడంతో లక్షల ఎకరాల పంట ఎండిపోయిందన్నారు. పంట పండితే బోనస్‌ ఇవ్వాలన్న భయంతోనే ఎండ బెట్టారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల వివరాలను సీఎంకు నేరుగా పంపిస్తామని, అయితే అన్ని వివరాలు తామే ఇస్తే.. ముఖ్యమంత్రి ఎందుకు? ఆయన అధికార యంత్రాంగం ఎందుకు? అని ప్రశ్నించారు.

రాముడికి మొక్కుదాం,బీజేపీని తొక్కుదాం

‘రాముడికి మొక్కుదాం.. ఎన్నికల్లో బీజేపీని తొక్కుదాం’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వికారాబాద్‌లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాముడికి దండం పెడదాం.. మోదీకి ఓటేద్దామంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, రాముడికి దండం పెడదాం.. కానీ, మోదీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి బీజేపీ ఏమి చేసిందో చెప్పగలరా? అని నిలదీశారు. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను పిరం చేసిన మోదీ.. పిరమైన ప్రధాని అని విమర్శించారు. మోదీ హవా ఉందని చెప్పే బీజేపీ నాయకులు ఇతర పార్టీల్లో నుంచి అభ్యర్థులను ఎందుకు వెతుక్కుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు బీజేపీతోనే పోటీ ఉందన్నారు. సీఎం రేవంత్‌ గుంపు మేస్త్రీ అయితే.. మోదీ తాపీ మేస్త్రీ అని, ఆ ఇద్దరూ కలిసి తెలంగాణలో బీఆర్‌ఎ్‌సకు సమాధి కట్టాలని చూస్తున్నారని అన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ద్రోహులని, విశ్వేశ్వర్‌రెడ్డి విశ్వాస ఘాతకుడని అన్నారు.

కొండా సురేఖ, యెన్నం, మహేందర్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం లీగల్‌ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. వారితోపాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్‌ చానళ్లకు కేటీఆర్‌ మరోసారి లీగల్‌ నోటీసులు పంపారు.

Updated Date - Apr 04 , 2024 | 05:55 AM

Advertising
Advertising