ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌లో చేరని వారిపై అక్రమ కేసులు

ABN, Publish Date - Apr 23 , 2024 | 04:34 AM

కాంగ్రె్‌సలో చేరాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకులను కాంగ్రెస్‌ నేతలు ఒత్తిడి చేస్తున్నారని, పార్టీలో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని

లబ్ధిపొందిన వారే పార్టీని వీడుతున్నారు

బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 10 సీట్లు: కేటీఆర్‌

సిరిసిల్ల, ఏప్రిల్‌ 22( అంధ్రజ్యోతి): కాంగ్రె్‌సలో చేరాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకులను కాంగ్రెస్‌ నేతలు ఒత్తిడి చేస్తున్నారని, పార్టీలో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ఆరోపించారు. ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని, ప్రజల పక్షాన ప్రజల సమస్యలే ఎజెండాగా కొట్లాడుదామని పిలుపునిచ్చారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల మునిసిపల్‌ బీఆర్‌ఎస్‌ క్లస్టర్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎ్‌సతో లబ్ధి పొందిన కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారని ఆరోపించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె్‌సపై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. రైతుబంధు అందించలేదని, రుణమాఫీ చేయలేదని, రైతులను మరోసారి మోసం చేయడానికి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపరని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 8 నుంచి 10 సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న సంజయ్‌ కరీంనగర్‌కు చేసిందేమీ లేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ను గెలిపిస్తే కరీంనగర్‌ను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మే 10న సిరిసిల్లలో కేసీఆర్‌ రోడ్‌ షో ఉంటుందని, ప్రతీ కార్యకర్త తరలివచ్చి, రోడ్‌ షోను విజయవంతం చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Apr 23 , 2024 | 04:34 AM

Advertising
Advertising