ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయభూమే కదా.. ఆక్రమించేద్దాం!

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:40 PM

ఆది రూ. 25 కోట్లకు పైగా విలువ చేసే భూమి. ఇంకే ముందు అక్రమార్కుల కన్ను దానిపై పడింది. అలయ భూమే కదా..అని యాచారంలోని తిరుమలేశుడి మాన్యాన్ని అక్రమించేద్దామని అక్రమార్కులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాలుగు ఎకరాలకు పైగా కబ్జా చేసి కడీలు నాటారు. ఇంత తతంగ జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

యాచారంలోని తిరుమలేశుడి భూమిని కబ్జాచేసి నాటిన కడీలు

కబ్జా చేసి.. కడీలు నాటిన అక్రమార్కులు!

యాచారంలో కబ్జాకు గురౌతున్న తిరుమలేశుడి భూములు

ఫఇప్పటికే నాలుగు ఎకరాలకు పైగా అన్యాక్రాంతం

ఉన్న మాన్యానికి శఠగోపం..

పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు

ఆది రూ. 25 కోట్లకు పైగా విలువ చేసే భూమి. ఇంకే ముందు అక్రమార్కుల కన్ను దానిపై పడింది. అలయ భూమే కదా..అని యాచారంలోని తిరుమలేశుడి మాన్యాన్ని అక్రమించేద్దామని అక్రమార్కులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాలుగు ఎకరాలకు పైగా కబ్జా చేసి కడీలు నాటారు. ఇంత తతంగ జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

యాచారం, జూలై 26: యాచారం మండల కేంద్రంలోని శ్రీ తిరుమలేశుడి ఆలయ భూములకు రక్షణ కరువైంది. అక్రమార్కులు ఆలయ భూమిని దర్జాగ కబ్జా చేస్తున్నారు. ఆలయ భూమిలో అక్రమార్కులు కొందరు కడీలు నాటి యథేచ్ఛగా భూ కబ్జాకు పాల్పడుతున్నారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్‌42లో 10.21 ఎకరాల తిరుమలేశుడి ఆలయ భూమి ఉంది. ప్రస్తుతం ఆభూమి విలువ రూ.25 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పటికే ఆభూమిలో సుమారు నాలుగు ఎకరాలకుపైగా అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ఉన్న భూమిపై కన్నెసిన కొందరు అక్రమార్కులు కబ్జాకు యత్నిస్తున్నారు. ఆలయ భూమిని ఆక్రమించేందుకు గోప్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆలయ భూమిలో పలు చోట్ల కడీలు నాటారు. కేవలం ఇంటిని నిర్మాణం చేయడానికి 120, 150, 200గజాల చొప్పున కబ్జాకు పాల్పడుతున్నారు. ఆలయ భూమిలో కడీలు నాటినా పట్టించుకోక పోవడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఇక్కడి భూములకు భారీగా డిమాండ్‌ పెరగడంతో ఈ భూమిని కాజేయడానికి కొంత మంది నాయకులు పావులు కదుపుతున్నారు. ఏడేళ్ల క్రితం ఇదే భూమిని కాజేయడానికి నగరానికి చెందిన కొందరు బడా నాయకులు యత్నించడంతో అప్పట్లో పత్రికలలో వచ్చిన కథనాలతో రెవెన్యూ అధికారులు విచారణ చేయడంతో కబ్జారాయుళ్లు వెనక్కి తగ్గారు. మళ్లీ కొంత కాలంగా ఈ భూమిపై కన్నేసిన వ్యక్తులు ఆలయ భూమిని అక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఆలయ భూమిని కాజేయడానికి పెద్దల హస్తం ఉండి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమిలో పలు చోట్ల కడీలు నాటడంతో పాటు ఫెన్సింగ్‌ వేశారు. నకిలీ పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు కొంతమంది నాయకులుపావులు కదుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కల్పించుకొని ఆలయ భూమిని సంరక్షించాలని కోరుతున్నారు.

సొంత డబ్బుతో ధూపదీపాలు

కాగా యాచారం మండల కేంద్రానికి చెందిన కొండాపురం యాదయ్య తన ఆస్తులను అమ్మి ఆలయ అభివృద్ధ్దికి పాటుపడ్డారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రాజేష్‌ సొంతడబ్బులతో ఆలయంలో స్వామివారికి పూజలు చేస్తుంటారు. ప్రతిఏటా స్వామి వారికి కల్యాణోత్సవం. రఽథోత్సవాన్ని గ్రామస్తులు నిర్వహిస్తారు. కాగా భక్తులకు తాగు నీటి ఇబ్బంది తీర్చడం కోసం మొండిగౌరెల్లి మాజీ ఎంపీటీసీ తాండ్ర లక్ష్మమ్మ తన సొంత డబ్బుతో బోర్‌ వేయించింది.

ఆలయ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు

ఆలయ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆలయ భూములను కాపాడే బాధ్యత అందరిది. త్వరలో ఆలయ భూమిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రకృతి వనం ఏర్పాటుకు కొంత మేర ఫెన్సింగ్‌ వేశారు. వనంలో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

ప్రణీత్‌, దేవాదాయ శాఖ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌

Updated Date - Jul 26 , 2024 | 11:57 PM

Advertising
Advertising
<