ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ కోసం జీవితం త్యాగం చేసిన ‘జిట్టా’

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:34 AM

తెలంగాణ సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్న నేత అని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు

జిట్టా బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు

భువనగిరి టౌన్‌, సెప్టెంబరు 15: తెలంగాణ సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్న నేత అని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన జిట్టా బాలకృష్ణారెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కళారూపాలు, వంటకాల, తెలంగాణకు జరిగిన అన్యాయంపై కళాకారుల ప్రదర్శనలతో ఆయన తెలంగాణ ఉద్యమానికి నూతన రూపం ఇచ్చాడన్నారు. రాష్ట్ర సాధన కోసం సొంత నిధులను వెచ్చించి చివరికి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరిగి ఎమ్మెల్యేగా రెండు సార్లు స్వతంత్య్ర అఽభ్యర్థిగా పోటీ చేసిన స్వల్ప తేడాతో ఓడినప్పటికీ ఆయనకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్నారు. చారిత్రాత్మక భువనగిరి ఖిల్లాకు లక్షల రూపాయల వ్యయంతో లైట్లు వేసి ఖిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఆయనదేనన్నారు. ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన జిట్టా కుటుంబానికి అందరము అండగా ఉండాలన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలను ఫ్లోరైడ్‌ రక్కసి నుంచి కాపాడేందుకు 20 ఏళ్ల క్రితమే కోట్లాది రూపాయల వ్యయంతో 150కి పైగా వాటర్‌ ఫిల్టర్లను ఏర్పాటు చేసిన గొప్ప నేత అని కొనియాడారు. ప్రభుత్వాలు చేయలేని పనులను ఆయన చేసి చూపించారన్నారు. ప్రజల మనసుల్లో నిలిచిన జిట్టా బాలకృష్ణారెడ్డి క్యాంస్య విగ్రహాన్ని భువనగిరిలో త్వరలో ప్రతిష్టిస్తామని తెలిపారు. జిట్టాపై ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న రాసి పాడిన పాటల సీడీ ఆయన విడుదల చేశారు.

జిట్టా కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జిట్టా ఫాంహౌజ్‌లో కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రులు జి జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎండి మహమూద్‌ అలీ, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, నోముల భగత్‌, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్‌, తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఉమాదేవి, మునిసిపల్‌ చైర్మన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌, తదితరులు నివాళులర్పించి జిట్టా కుటుంబాన్ని పరామర్శించారు.

Updated Date - Sep 16 , 2024 | 12:34 AM

Advertising
Advertising