ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు 6కు వాయిదా

ABN, Publish Date - May 03 , 2024 | 05:22 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ, ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు

Delhi liquor scam case

న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ, ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ కేసులో గత నెల 22న విచారణ జరిపిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 2వ తేదీకి రిజర్వ్‌ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో మాత్రం తీర్పును ఈ నెల 6వ తేదీకి రిజర్వ్‌ చేసింది. సీబీఐ కేసులో గురువారం క్లారిటీ వస్తుందని భావించగా, న్యాయస్థానం మరోసారి తీర్పును వాయిదా వేసింది. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రోజునే (ఈ నెల 6వ తేదీ)సీబీఐ కేసులోనూ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్నట్టు ఢిల్లీ రౌస్‌ అవెన్యు కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ కావేరి భవేజా స్పష్టం చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని, కవిత మహిళ కాబట్టి పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, మరో న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. కుంభకోణంలో కవితదే కీలక పాత్ర అని, ఆమెకు సమాజంలో పలుకుబడి ఉందని, బెయిల్‌పై బయటికొస్తే సాక్షులను బెదిరిస్తారని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని సీబీఐ, ఈడీ తరఫున న్యాయవాదులు వాదించారు. కవితను ఈడీ మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో మార్చి 26న కవితను తిహాడ్‌ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ విచారించింది. ఆ తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించింది. కోర్టు అనుమతితో మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ నెల 7వ తేదీతో కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ ముగియనుంది.

Updated Date - May 03 , 2024 | 05:22 AM

Advertising
Advertising