గ్రూప్-3 పరీక్షకు 50.93 శాతం హాజరు
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:35 AM
జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్షకు మొదటి పేపర్‌కు 50.93 శాతం, రెండవ పేపర్‌కు 49.62 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.
పెద్దపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్షకు మొదటి పేపర్‌కు 50.93 శాతం, రెండవ పేపర్‌కు 49.62 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దరఖా స్తు చేసుకున్న వారిలో కేవలం 50.93 శాతం మాత్రమే హాజరు కావడం గమనార్హం. జిల్లాలో 8947 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు పెద్దపల్లి, సెంటినరీకాల నీ, గోదావరిఖనిలో 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12:30 గంట లకు 4557 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యా హ్నం 2 గంటల 4:30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 4440 మంది 49.62శాతం అభ్యర్థులు హాజర య్యారు. ఈనెల 18న ఉదయం మూడవ పేపర్ ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు జరగనున్నది. ఈ పరీక్షకు గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతిం చారు. పరీక్షా జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 20 మంది దివ్యాంగుల కోసం పెద్దప ల్లిలో గల జడ్పీ పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేశారు. వీరికి అదనంగా అర గంట సమయం కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. పటిష్ట పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేశారు. పెద్దప ల్లిలోని ట్రినిటీ కళాశాలలో ఏర్పా టుచేసిన కేంద్రాన్ని, సెంటినరీ కాలనీలో గల జేఎన్‌టీయూ కళా శాల కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. కేంద్రాలను డీసీపీ అడ్మిన్ రాజు, పెద్దపల్లి, రామగుండం ఏసీపీలు గజ్జి కృష్ణ, మడత రమేష్, సీఐలు కేంద్రాలను సందర్శించారు. సోమవారం నాటితో గ్నూపు-3 పరీక్ష ముగియనున్నది.
Updated Date - Nov 18 , 2024 | 12:35 AM