సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ABN, Publish Date - Nov 07 , 2024 | 12:56 AM
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందిగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
- ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్
కొడిమ్యాల నవంబరు 6(ఆంధ్రజ్యోతి): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందిగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కొడిమ్యాలలో సర్వే స్టిక్కరింగ్‌ను కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ నిర్ధారణ వివరాలు తప్పుగా లేకుండా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మధుసూదన్‌గౌడ్, డీఆర్డీవో రఘువరన్, అధికారులు ఉన్నారు.
మల్యాల, (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని నూకపల్లిలో బుధవారం స్టిక్కరింగ్‌ను పరిశీలించారు. అధికారులు అన్ని గ్రామాల్లో స్టిక్కరింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, ఎంపీవో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కొడిమ్యాల (ఆంధ్రజ్యోతి): మండలంలోని పూడూర్‌లో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి పరిశీలించారు. సర్వే సమయంలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో తప్పులు దొర్లకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో స్వరూప, ఎంపీవో సలీం, పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
పెగడపల్లి (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వే సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో ఎ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి స్టిక్కర్ అంటించే కార్యక్రమాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ప్రారంబించారు. సర్వేను తహసీల్దార్ రవీందర్, ఎంపీవో మహేందర్ తదితులు పర్యవేక్షించారు.
రాయికల్ (ఆంధ్రజ్యోతి): రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కులగణన సర్వే ప్రారంభమైంది. రాయికల్ పట్టణంలో సర్వేను తహసీల్దార్ ఖయ్యూం, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వెల్గటూర్ (ఆంధ్రజ్యోతి): మండలంలో అధికారులు కుటుంబాల గుర్తింపు సర్వే ప్రారంభించారు. వివిధ గ్రామాల్లో ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ ఒక్కో ఇంటిలో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయో తెలుసుకొని స్టిక్కర్లు అంటించారు. తహసిల్దార్ శేఖర్, మండల పంచాయితీ అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి ప్రభాకర్ పర్యవేక్షించారు.
కథలాపూర్ (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో కుల గణన సర్వేను మండల ప్రత్యేకాధికారి, జిల్లా అడిషనల్ డీఆర్‌డీవో మదన్‌మోహన్ పరిశీలించారు. ఇంటింటికీ తిరిగి ఎన్యుమనేటర్లు స్టిక్కర్లు వేస్తున్న ప్రక్రియను పరిశీలించి పకడ్బందీగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ వినోద్, ఆర్‌ఐ నగేశ్, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు ఉన్నారు.
కోరుట్ల (ఆంద్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్న సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం అధికారులు పలు వార్డులలో అధికారులు నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డులలో సర్వే బృందం ఇంటింటి స్టిక్లర్ అంటించి ఇంటి వివరాలను సేకరించారు. పట్టణంలోని పలువార్డులలో కోరుట్ల రెవ్వెన్యూ డివిజన్ అధికారి జివాకర్ రెడ్డి పరిశీలించారు. సర్వే బృందాలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయా కార్యక్రమలలో తహసిల్దార్ కిషన్, కమీషనర్ తిరుపతిలతో పాటు పలువురు పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్ (ఆంద్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాలలో సామాజికి సర్వే బృందం ఇంటింటి కుల గణన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక విద్యా ఉపాధి, ఆర్ధిక సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారు. అధార్, రేషన్ కార్డుల రికార్డులను పరిశీలించాలరు. పలు గ్రామాలలో సర్వే వివరాలను తహసిల్దార్ కిషన్, ఎంపీడీఓ రామకృష్ణలు పరిశీలించారు.
మెట్‌పల్లి టౌన్ / ఇబ్రహీపట్నం (ఆంద్రజ్యోతి): మెట్‌పల్లి పట్టణంతో పాటు ఇబ్రహీపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో అఽధికారులు సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు. మెట్‌పల్లితో పాటు ఇబ్రహీపట్నం మం డలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటి సర్వేలో భాగంగా ఇంటికి సర్వేలో స్టికర్‌ను అతికించి ఇంటి వివరాలను సేకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీర్‌పూర్ (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వే బీర్‌పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా గ్రామాల్లో సర్వే సిబ్బంది ఇంటింటికి తిరిగి గృహాలకు సిక్కర్లు అంటించారు. కార్యక్రమంలో సర్వే ఇంచార్జులు, కార్యదర్శులు, టీచర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 12:56 AM