ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:55 AM

సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పతి

- వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

కరీంనగర్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సమగ్ర సర్వేపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో కలిసి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ శనివారం నుంచి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లుకు సమాచారం ఇవ్వాలని కోరారు. సర్వే సమాచారం గ్రామస్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్ళలో సర్వే గురించి తెలిపే హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్లతోపాటు అన్ని స్థాయిల్లో అధికారులు సర్వే ప్రక్రియ ను పరిశీలిస్తూ సిబ్బందికి తగు, సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.

ఫ షెడ్యూల్‌ ప్రకారం సర్వే పూర్తి చేయాలి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

షెడ్యూల్‌ ప్రకారం నిర్దిష్ట వ్యవధిలోగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసిన అనంతరం సర్వేపై కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏరియాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతిరోజూ సర్వేపై నివేదిక సమర్పించాలని, నింపిన ఫారాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ పూర్తి అయిన సర్వే ఫారాలను జాగ్రత్తగా భద్రపరచాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయి, డీఆర్డీవో శ్రీధర్‌, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య, డీఆర్వో వెంకటేశ్వర్లు, డీపీవో రవీందర్‌, జిల్లా యూత్‌ కోఆర్డినేటర్‌ రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:56 AM