ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:22 AM

ప్రభుత్వం చేపట్టిన ఇంటిం టి సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తూ వివరా లు సేకరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టర్‌ శ్రీహర్ష పెద్దపల్లి మండలంలో సోమవారం విస్తృతంగా పర్య టించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు.

పాలితంలో సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- ధాన్యం కొనుగోళ్లను సజావుగా జరపాలి

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన ఇంటిం టి సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తూ వివరా లు సేకరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టర్‌ శ్రీహర్ష పెద్దపల్లి మండలంలో సోమవారం విస్తృతంగా పర్య టించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. పెద్దపల్లి మండలంలోని కాపులపల్లి, గ్రామం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రం, కాసులపల్లి, పాలితం గ్రామాల్లో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గ్రా మంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పక్కగా చేయాలన్నారు. ప్రతీ కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలని, ఏ ఒక్క కుటుంబం కూడా మిస్‌ కావడానికి వీల్లేదని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ప్రతీరోజు 15 కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని రైతులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యా న్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. రైస్‌ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని బ్యాగులు అందుబాటులో పెట్టుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో మాని టరింగ్‌ అధికారి ఎం శివప్రసాద్‌, పంచాయ తీ కార్యదర్శులు అహ్మద్‌ బాషా, లక్ష్మణ్‌ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:22 AM