ఘనంగా ఆరోగ్య ఉత్సవాలు
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:04 AM
: ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాల్లోని నర్సింగ్ కళాశాలలు, మైత్రి ట్రాన్స్ క్లినిక్స్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఎంహెచ్‌వో డాక్టర్ వసంతరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ నారాయణ, డీసీహెచ్‌ఎస్ పెంచలయ్య, జీజీహెచ్ వైద్యుడు సంతోష్ కుమార్ హాజరయ్యారు. వర్చువల్ పద్ధతిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశా లను, మైత్రి ట్రాన్స్ క్లినిక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించగా స్థానికంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా జ్యోతిప్రజ్వలన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో 30 డిప్లమా ఇన్ అనస్థీషియా కోర్సులకు, 30 డిప్లమా ఇన్ ఈసీజీ కోర్సులకు మొత్తం 60 సీట్లు, 14 వైద్య పోస్టులు, 3 అంబులెన్లు మంజూరు చేశారు. జిల్లా ఆస్పత్రిలో మైత్రి ట్రాన్స్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో 116 రూం నంబరులో ముగ్గురు వైద్యులతో క్లినిక్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 01:04 AM