ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీహెచ్‌పీలో సమస్యలను పరిష్కరించాలని వినతి

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:06 AM

ఓసీపీ-3 సీహెచ్‌పీలో నెలకొన్న సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు సీహెచ్‌పీ ఇన్‌చార్జి సదానందంకు వినతిపత్రాన్ని అందజేశారు.

యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 17: ఓసీపీ-3 సీహెచ్‌పీలో నెలకొన్న సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు సీహెచ్‌పీ ఇన్‌చార్జి సదానందంకు వినతిపత్రాన్ని అందజేశారు. సీహెచ్‌పీ ఆవరణ లో విపరీతమైన దుమ్ముతో కార్మికులు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందు లు పడుతున్నట్టు తెలిపారు. క్వారీ నుంచి తీసుకువచ్చే మండుతున్న బొగ్గు నుంచి విషవాయువులు వెలువడుతుండడంతో కార్మికులు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ఫైర్‌ కోల్‌ రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీడర్‌ క్యాబిన్‌లో ఏసీలను ఏర్పాటు చేయాలని, వేసవిని దృష్టిలో ఉంచుకుని కార్మికులకు త్రాగునీటి కోసం వాటర్‌ కూలర్‌ను ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. సర్ఫేస్‌ ఫీడర్‌లో రక్షణ చర్యలు తీసుకోవాలని, పెరిగిన మ్యాన్‌ పవర్‌కు తగినట్టు ప్లేడేలు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న యాక్టింగ్‌ ప్రమోషన్స్‌(వ్యాగన్‌ లో డింగ్‌మజ్దూర్‌, లారీ మొఖద్దం, ట్రాలీ ఆపరేటర్‌, పంప్‌ ఆపరేటర్‌, టెండా ల్‌) ఇవ్వాలని మెమొరాండంలో పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ జిగురు రవీందర్‌, అసిస్టెంట్‌ సెక్రెటరీలు శ్యాంస న్‌, గంధం సాంబశివరావు, పిట్‌ సెక్రెటరీ సెగ్గం శంకర్‌, అసిస్టెంట్‌ సెక్రె టరీ అల్లి రమేష్‌, రాజ్‌కుమార్‌లున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:06 AM

Advertising
Advertising