ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర

ABN, Publish Date - Jun 03 , 2024 | 12:27 AM

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామి అని రామగుండం, తెలం గాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుల ఈడీ కేదార్‌ రంజన్‌ పాండు అన్నారు.

జ్యోతినగర్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామి అని రామగుండం, తెలం గాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుల ఈడీ కేదార్‌ రంజన్‌ పాండు అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం ఈడీ ప్రసంగించా రు. నాలుగున్నర దశాబ్దాలుగా 2600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ రాష్ట్రానికి వెలుగులను అందిస్తోందన్నా రు. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీర్చడంలో ఘననీయమైన పాత్ర పోషిస్తున్నదన్నా రు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నెలకొల్పిన 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రారంభమైందని, ఈ ప్రాజెక్టు నుంచి 85 శాతం విద్యుత్‌ రాష్ట్రానికే కేటాయించినట్లు తెలిపారు. టిఎస్‌టిపిపి వల్ల రాష్ట్రానికి మరింత మేలు జరగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 ఏళ్లలో రాషరఒం ఎంతో అభి వృద్ధి చెందిందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రయోజనాల పరి రక్షణకు ఎన్టీపీసీ తన వంతు కృషి చేస్తుందని ఈడీ కేదార్‌ రంజన్‌ పాండు తెలిపారు. ఎన్టీపీసీ ఎన్‌బీసీ సభ్యుడు బా బర్‌ సలీంపాషా మాట్లాడుతూ దేశంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్టీపీసీ విద్యుత్‌ అవసరాలను తీరుస్తున్నదన్నా రు. ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా ఎన్టీపీసీ అభివృద్ధి పథంలో నడుస్తోందని, ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఉద్యోగి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, గుర్తింపు సం ఘం అధ్యక్ష,కార్యదర్శులు వేముల కృష్ణయ్య, ఆరెపల్లి లక్ష్మీ నారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:27 AM

Advertising
Advertising