ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూకేటాయింపులు పకడ్బందీగా జరగాలి

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:03 AM

మంథని పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులకు అవస రమైన భూ కేటాయింపులు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

మంథని, సెప్టెంబరు 11: మంథని పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులకు అవస రమైన భూ కేటాయింపులు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పట్టణంలోని, శివారు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్‌ శ్రీహర్ష జేసీ అరుణశ్రీతో కలిసి బర్రెకుంట, బాయ్స్‌ హైస్కూల్‌, గర్ల్స్‌ హైస్కూల్‌, ఏఎంసీ సమీపంలోని దేవదాయ శాఖ, డిగ్రీ కళాశాల సమీపంలోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని బుధవారం పరిశీలించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ పాత డపింగ్‌ యార్డులో లెవలింగ్‌ పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో సమీకృత వెజ్‌, నాజ్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం, నూతన మున్సిపల్‌ భవన నిర్మాణం, సబ్‌స్టేషన్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ ఆఫీసుల నిర్మాణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల స్కెచ్‌లను పూర్తి చేసి, ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎక్కడ వీలుగా ఉంటుందో నివేదిక సమర్పించాల న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హనుమానాయక్‌, ల్యాండ్‌ సర్వే ఏడీ శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:03 AM

Advertising
Advertising