చదువుతో పాటు క్రీడల్లో గురుకులాల ఖ్యాతిని చాటాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:33 AM
చదువుతో పాటు క్రీడల్లో రాణించి గురుకులాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మానకొండూర్ మండలంలోని దేవంపల్లి గురుకుల పాఠశాలలో సోమవారం జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది.
మానకొండూర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు క్రీడల్లో రాణించి గురుకులాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మానకొండూర్ మండలంలోని దేవంపల్లి గురుకుల పాఠశాలలో సోమవారం జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్దికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో సమస్యల పరిష్కరానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి పాఠశాలకు, ప్రభుత్వానికి పేరు తీసురావాలని సూచించారు. జోన్ లెవల్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవుతారని ఆయన తెలిపారు. అంతకు ముందు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి, క్రీడా జ్యోతిని వెలిగించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సంయుక్త కార్యదర్శి అనంతలక్ష్మి, తహసీల్దార్ బి రాజేశ్వరి, ఎంఈవో మధుసూదనాచారి, ప్రిన్సిపాల్స్ గోలి జగన్నాథం, లచ్చయ్య, అశోక్‌బాబు, జి అశోక్‌రెడ్డి, వాసు, ఇసాక్, శివప్రసాద్, శేఖర్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన 1,190 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:33 AM