ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సన్న ధాన్యానికి బోనస్‌తో అదనపు ప్రయోజనం

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:46 AM

ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇస్తుండడంతో రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని, రైస్‌ మిల్లర్లకు సంబంధం లేకుండా ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

పెద్దపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇస్తుండడంతో రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని, రైస్‌ మిల్లర్లకు సంబంధం లేకుండా ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ విప్‌ అడ్లూరు లక్ష్మణ్‌ కుమార్‌, పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయ రమణారావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ డి వేణుతో కలిసి సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ప్రకటించడంతో రైతులకు అధికంగా లాభం చేకూరుతుం దని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి రైతు ఎంత లబ్ధి పొందుతున్నాడు వివరాలతో గ్రామా లలో బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతుల కు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, 2 లక్షల రుణ మాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్‌ పథకాల లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సన్న రకం వడ్లకు బోనస్‌ పడుతుంది అనే అంశం రైతులకు తెలిసేలా చేయాలని, ప్రతి రోజు సన్న రకం వడ్ల బోనస్‌ ఎంత వస్తుందో ప్రచారం కల్పించాలని అన్నారు. మనం చేసే కష్టం క్ష్షేత్ర స్థాయిలో అందరికీ తెలియజేయా లని మంత్రి పేర్కొన్నారు. రైస్‌ మిల్లర్లకు సంబంధం లేకుండా ట్రక్‌ షీట్‌ జనరేట్‌ అయ్యే విధంగా చూడాలని, రైతులకు ఎక్కడ కోతలు విధించడానికి వీలు లేదని మంత్రి తెలిపారు. రైతులను ఎట్టి పరి స్థితులలో దోపిడీకి గురి చేయడానికి ఆస్కారం ఇవ్వవద్దని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో దాదాపు ఇప్పటి వరకు 80 శాతం మేరకు ధాన్యం నగదు చెల్లించ డాన్ని మంత్రి శ్రీధర్‌ బాబు అభినందించారు. జిల్లాలో 51 వేల 827 రైతులకు 372 కోట్ల 59 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశా మని అన్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్‌, రేషన్‌ కార్డు వంటి సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతులకు కూడా త్వరలో రుణమాఫీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలం 82 శాతం మేర సన్న రకం వడ్ల పంట వస్తుందన్నారు. రైతులకు సన్న రకం వడ్ల బోనస్‌ వల్ల అధికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. పెద్దపల్లి జిల్లాలో తేమ శాతం వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి 24 గంటల వ్యవధిలో రైస్‌ మిల్లులకు తరలించి ఓపీఎంఎస్‌ వెబ్‌ సైట్‌లలో నమోదు చేస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు లకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చూస్తున్నామన్నారు. యూని యన్‌ బ్యాంకులో 3 వేల మంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదని, ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొ ని వెళ్ళామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, డీఎస్‌ఓ రాజేందర్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:46 AM