సీఎంను కలిసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:42 AM
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన అంతటి అన్నయ్యగౌడ్ సీఎం రేవం త్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
సుల్తానాబాద్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన అంతటి అన్నయ్యగౌడ్ సీఎం రేవం త్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. అంతకుముందు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, మంత్రులు శ్రీధర్‌భాబు, పొన్నం ప్రభాకర్, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ను కలిసి కృత జ్ఞతలు తెలిపారు. వెంట రైస్‌మిల్లర్ల సంఘం నాయకుడు నగునూ రి అశోక్‌కుమార్, సుల్తానాబాద్ మాజీ జడ్పీటీసీ మినుపాల స్వరూ పప్రకాష్‌రావు, దుగ్యాల సంతోష్‌రావు, సాగర్ తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లాకు వచ్చిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్‌కు పెద్దపల్లి నియోజకవర్గ సరిహద్దు దుబ్బపల్లి వద్ద ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా సుల్తానాబాద్ చేరుకున్నారు.
Updated Date - Oct 21 , 2024 | 12:42 AM