గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:04 AM
గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కోరారు. వేములవాడ గుడి చెరువు కట్టపై మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిమజ్జనోత్సవం ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు.
వేములవాడ, సెప్టెంబరు 15: గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కోరారు. వేములవాడ గుడి చెరువు కట్టపై మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిమజ్జనోత్సవం ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ వేములవాడ పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో కలిపి దాదాపుగా 300 పైగా గణేష్ మండపాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీ గణనాథులను ఊరేగింపుగా తీసుకొచ్చేందుకు వీలుగా పట్టణంలో ఏర్పాట్లు చేయాలని, ప్రధాన కూడళ్లలో లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని కోరారు. పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరాతోపాటు నిమజ్జనోత్సవం చూడ డానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గణేష్ నిమజ్జనోత్సవానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిం చాలని, మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలలో నిధుల కొరత కారణంగా ఏర్పాటు సక్రమంగా చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, నాయకులు పిన్నింటి హనుమాండ్లు, గుడిసె మనోజ్, నామాల శేఖర్, సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 16 , 2024 | 12:04 AM