గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:45 AM
గ్రూప్ 3 పరీక్షల ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : గ్రూప్ 3 పరీక్షల ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవా రం గ్రూప్3 పరీక్షల ఏర్పాట్లు, సన్నద్ధతపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఈనెల 17ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి 5.30 వరకు రెండు సెషన్లు, 18నఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు గ్రూప్ 2 పరీక్షలు సజా వుగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారు లకు సూచించారు. గ్రూప్3 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలు గా జిల్లాస్థాయిలో చేస్తున్న ఏర్పాట్ల వివరాలను చైర్మన్ అడిగి తెలుసుకు న్నారు. పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రాలు, ఇతర ముఖ్యమైన సామ గ్రి స్ట్రాంగ్ రూమ్‌లో స్టోర్ చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు అభ్య ర్థులను ఉదయం సెషన్‌లో 8.30 నుంచి, మధ్యాహ్నం సెషన్‌లో 1.30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30గంటలకు మూసివేస్తామని, ఆ తర్వా త పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పోలీ సు బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144సెక్షన్ అమలు చేయాలని, ఎక్కడ ఎటువంటి పొరపాటు రాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి 3 నుంచి 4 పరీక్ష కేంద్రాలకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటుచేయాలని, పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చూడాలని సూచిం చారు. గ్రూప్ పరీక్షల నిర్వహణకు ఎంపికచేసిన పరీక్షా కేంద్రాలను తని ఖీచేసి అక్కడ అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకో వాలని, ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు వీలుగా జాయింట్ రూట్ అధికారులను నియమించాలని, ప్రతి 150మంది అభ్య ర్థులకు ఒక ఐడెంటిఫికేషన్ అధికారులు గానీ నియమించాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని తెలి పారు. ఈ సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, సంబంధించిన అధికారు లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 12:45 AM