ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:20 AM

వైద్యవృత్తిని ఎంచుకున్న విద్యార్థులు విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): వైద్యవృత్తిని ఎంచుకున్న విద్యార్థులు విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం గోదావరిఖనిలోని సింగరేణి వైద్య కళాశాలలో నిర్వహిం చిన వైట్‌ కోట్‌ సేర్మనీకి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హాజరై ప్రసంగించారు. వైద్యులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్ధేశించుకున్న లక్ష్యాలను వైట్‌కోట్‌ సేర్మనీ గుర్తు చేస్తుందని కలెక్టర్‌ తెలిపారు. గత రెండు న్న సంవత్సరాలుగా మీరు చేసిన కృషి ఫలితంగా ఈ రోజు వైట్‌ కోట్‌ సర్మనీలో పాల్గొంటున్నారని, ఇక్కడ విద్యార్థులు వివిధ ప్రాంతాలు, సామాజిక ఆర్థిక పరిస్థి తుల నుంచి వచ్చినవారు ఉన్నారని ప్రతి ఒక్కరికి ప్రత్యే కమైన కృషి ఉందన్నారు. సింగరేణి ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ మూడు సంవత్సరాలుగా ఉన్నతమైన సేవలందిస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్యకళాశాలగా తీర్చి దిద్దే దిశగా కృసి చేస్తున్నారన్నారు. రాబోయే నాలుగున్న ర సంవత్సరాలు మీ జీవితంలో చాలా కీలకం కాబోతుం దని, అనేకసార్లు నిరుత్సాహపడే పరిస్థితులురావచ్చని, ఒత్తిడి పెరగవచ్చని, ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మ కం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దన్నారు. సింగరేణి వైద్య కళా శాల నుంచి మొదటి బ్యాచ్‌గా వచ్చే 150 మంది వైద్యు లు ప్రపంచంలో ఎక్కడున్న ప్రజలకు ఉత్తమమైన సేవ లందిస్తూ కళాశాలకు గర్వకారణంగా ఉంటారని తెలి పారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హిమబిందుసింగ్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:20 AM