ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:34 AM

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో వైట్‌ కోట్‌ వేడుకలు నిర్వహించారు.

విద్యార్థులతో ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌

సిరిసిల్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో వైట్‌ కోట్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్‌ విద్యార్థులకు వైట్‌కోట్‌ సెర్మనీ ప్రత్యేకమైందని, తల్లిదండ్రులు పెట్టుకున్నా నమ్మకాన్ని వమ్ము చేయ కుండా ముందుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వం వైద్య విద్యను ప్రోత్సహించేందుకు కాలేజీలను ప్రారంభిం చిందన్నారు. నూతనంగా 16 నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 240కి పైగా అంబు లెన్స్‌లను ప్రజారోగ్యం కోసం అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా వైద్యాఽధికారి డాక్టర్‌ వసంతరావు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, వేములవాడ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పెంచలయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపరెడ్డి, చొప్పదండి ప్రకాష్‌, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:34 AM