మూలవాగు బఫర్ జోన్‌కు హద్దులు
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:16 AM
చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణలను తొలగించేందుకు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లాల్లోనూ అదే తరహా కార్యకలాపాలను అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో బుధవారం వేములవాడ పట్టణ మూలవాగు పరివాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధి కారులు సర్వే చేపట్టడం ప్రాధాన్యం సంతరిం చుకుంది.
వేములవాడ, సెప్టెంబరు 11: చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణలను తొలగించేందుకు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లాల్లోనూ అదే తరహా కార్యకలాపాలను అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో బుధవారం వేములవాడ పట్టణ మూలవాగు పరివాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధి కారులు సర్వే చేపట్టడం ప్రాధాన్యం సంతరిం చుకుంది. మూలవాగు పరి వాహక ప్రాంతంలోని మొదటి బైపాస్ రహ దారిలో బఫర్‌జోన్ హద్దులను నిర్ణయించి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మరోసారి రెండో బైపాస్ రహదారి ఆనుకొని ఉన్న మూలవాగు పరివాహక ప్రాంతంలోనూ అధికారులు సర్వే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు సంబం ధించిన అధికారులు మూలవాగు బఫర్ జోన్ హద్దులు నిర్ణయించేందుకు బుధవారం సర్వే నిర్వహించారు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న వాగు వెంట అధికారులు సర్వే చేస్తూ హద్దులు ఏర్పాటు చేయడంలో నిమగ్న మయ్యారు. ఈ క్రమంలో మూలవాగు వెంబడి దాదాపు 40 కట్ట డాలు నిబంధనలను అతిక్రమించి నిర్మించినట్లు గుర్తి ంచినట్లుగా సమాచారం. రెండు రోజుల్లో హద్దులను ఏర్పాటు చేసి బఫర్ జోన్ హద్దులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్, జిల్లా ఇన్చార్జ్ ఏడి సర్వేయర్ వినయ్, డిఐ బాలచంద్రం, ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్, సంపత్ తదితరులు సర్వే నిర్వహించిన అధికారుల బృందంలో ఉన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 12:16 AM