కూల్చివేతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ధర్నా
ABN, Publish Date - Nov 07 , 2024 | 12:49 AM
రామ గుండం నగరపాలకసంస్థ పరిధిలో అక్రమ కట్ట డాల పేర కూల్చివేతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం దర్ ఆధ్వర్యంలో బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు.
కోల్‌సిటీ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రామ గుండం నగరపాలకసంస్థ పరిధిలో అక్రమ కట్ట డాల పేర కూల్చివేతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం దర్ ఆధ్వర్యంలో బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. వినతి పత్రం ఇస్తామంటూ పోలీసులకు చెప్పి కార్యాల యానికి వచ్చిన కార్పొరేటర్లు, నాయకులు కార్యా లయంలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. కూల్చివేతలను ఆపాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడు తూ రామగుండంలో అరాచక పాలన సాగుతోం దని, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను టార్గెట్‌గా చేస్తూ కూల్చివేతలకు పాల్పడుతున్నారని, కూల్చి వేతలను ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకో వాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యాపారులకు ఎలాంటి సమాచారం లేకుండానే కూల్చివేతలు చేస్తున్నారని, ఆర్టిస్టుల ఫ్లెక్సీల బోర్డులను తొల గించి వారిని రోడ్డున పడేశారన్నారు. గోదావరి ఖనిలో అనధికారిక కట్టడాలే ఎక్కువగా ఉన్నా యని, వాటికి ఫీజులు తీసుకుని క్రమబద్ధీకరిం చాలి తప్ప కూల్చివేతలు చేయకూడదన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కార్యాలయంలో ఆందోళన విరమించాల్సిందిగా బీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్త లు నినాదాలు చేశారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది కార్పొరేటర్లు, నాయకులను బలవం తంగా పంపించేందుకు ప్రయత్నించగా మహిళా కార్పొరేటర్లు, నాయకురాళ్లు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. కార్యాలయంలోని చెట్ల కుండీలు పగిలిపోయాయి. పోలీసులు బల వంతంగా మాజీ ఎమ్మెల్యే చందర్, డిప్యూటీ మే యర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు పెంట రాజేష్, భాస్కర్, కృష్ణవేణి, బాదె అంజలి, శివకుమార్, కవిత సరోజి, గాదం విజయ తదితరులను బయటకు పంపారు. అనంతరం కార్యాలయం బయట ఆందోళన నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్‌కు రాయలింగుకు వినతి పత్రం అందజేసి ఆందోళన విరమింప చేశారు. ఈ నిరసనలో నాయకులు అచ్చె వేణు, నూతి తిరుపతి, మారుతి, బొడ్డుపెల్లి శ్రీనివాస్, తోకల రమేష్, మెతుకు దేవరాజు, సట్టు శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, ఇరుగురాళ్ల శ్రావణ్, చల్లగురుగులమొగిలి, రామరాజు, వెంకన్న తది తరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులపై కేసు..
గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని సిరి ఫంక్షన్ హాల్‌లోని నిర్మాణాలను తొలగించినందుకు నిర సనగా బుధవారం బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్ కార్యాలయంలోకి దౌర్జ న్యంగా దూసుకెళ్లి ప్రజలకు, అధికారుల విఽధుల కు ఆటంకం కలిగించారని కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రాజేష్ వేణు, మరో 30మందిపై కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్ ఎస్‌ఐ కే రమేష్ పేర్కొన్నా రు. దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 12:49 AM