ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్‌ఎస్‌

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:30 AM

బీఆర్‌ఎస్‌ నాయ కులు మతిభ్రమించి మాట్లాడుతూ ప్రజలను, రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయరమణారావు

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 21 (ఆంద్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నాయ కులు మతిభ్రమించి మాట్లాడుతూ ప్రజలను, రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ప్రచారాన్ని చేయడా న్ని ఖండిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నాలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలన్నారు. పదేళ్లకాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండుసార్లు రైతు రుణమాఫీ చేస్తామని, మోసం చేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. 2014, 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని, విడతల వారీగా చేయడంతో, రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే 70 శాతం పైగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. మిగితా రైతుల చిక్కులు పరిష్కరించి అందరికి రుణమాఫీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. సన్నవడ్లకు ఈ సీజన్‌ నుంచే ఐదు వందల రూపాయల బోనస్‌ చెల్లిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఈర్ల స్వరూప, నాయకులు జడల సురేందర్‌, నూగిళ్ళ మల్లయ్య, సందనవేన రాజేందర్‌, ఉప్పు రాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:30 AM