ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:19 AM

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి అన్నారు. బుధవారం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నగరంలోని సప్తగిరికాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు.

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 4: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి అన్నారు. బుధవారం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నగరంలోని సప్తగిరికాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు పిల్లల బరువు, ఎత్తు చూసి తల్లిదండ్రులకు తెలియజేయాలని అంగన్‌వాడీ టీచర్లను ఆదేశించారు. పీహెచ్‌సీ వైద్యురాలు అఖిల మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్ణీత సమయం ప్రకారం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని గర్భిణులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం లావణ్య, హెల్త్‌ సూపర్‌వైజర్‌ సాగర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ స్వప్న, అంగన్‌వాడీ టీచర్‌ హరిప్రియ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:19 AM

Advertising
Advertising