ప్యాడీ క్లీనర్లతో ధాన్యాన్ని శుభ్రం చేసుకోవాలి
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:55 AM
జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్లతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు.
సుల్తానాబాద్/పెద్దపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్లతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. శనివారం ఆయన సుల్తానాబాద్ మండలంలోని గర్రెప ల్లి, భూపతిపూర్, కాట్నపల్లి, తదితర గ్రామాలను సంద ర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలని, హమాలీల సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పక్కగా చేయాలని, ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలని, ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ కావడానికి వీల్లేదని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం పెద్దపల్లిలో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. తర్వాత మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ల్యాబ్, ఓపీ విభాగాన్ని తనిఖీ చేశారు. ల్యాబ్ రిపోర్టులు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్‌డీవో గంగయ్య, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంక టేష్, సుల్తానాబాద్ ఏపీఎం శ్రీనివాస్, సంబంధిత అధి కారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 12:55 AM