ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌ టికెట్‌ తేలేది నేడే

ABN, Publish Date - Apr 14 , 2024 | 12:52 AM

కాంగ్రెస్‌ పార్టీ తన కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ అభ్యర్థి ఎవరో ఆదివారం ప్రకటించే అవకాశం ఉన్నది. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడడంతో ఆ పార్టీ పెద్దలు తెలంగాణలో మిగిలిపోయిన మూడు స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. కరీంనగర్‌ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు, ప్రవీణ్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా, రాజేందర్‌రావుకే అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉందని తెలుస్తున్నది.

- హైదరాబాద్‌లో నేతల భేటి

- సాయంత్రానికి ప్రకటించే అవకాశం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ పార్టీ తన కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ అభ్యర్థి ఎవరో ఆదివారం ప్రకటించే అవకాశం ఉన్నది. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడడంతో ఆ పార్టీ పెద్దలు తెలంగాణలో మిగిలిపోయిన మూడు స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. కరీంనగర్‌ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు, ప్రవీణ్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా, రాజేందర్‌రావుకే అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉందని తెలుస్తున్నది. రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థుల సంఖ్య ఇప్పటికే ఎక్కువ కావడంతో ప్రవీణ్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం లేదని సమాచారం. ఈ నెల 13న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని కరీంనగర్‌ అభ్యర్థి పేరును ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ హైదరాబాద్‌లోనే ఉండడంతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూడు స్థానాల అభ్యర్థుల విషయంలో చర్చించలేదని సమాచారం. ఆదివారం దీపాదాస్‌ మున్షీ కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీజేపీకి వ్యతిరేకంగా చేపడుతున్న దీక్షలో పాల్గొంటారు. ఆమె సాయంత్రానికి హైదరాబాద్‌ తిరిగి వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, రోహిత్‌చౌదరి, తదితర కమిటీ సభ్యులతో సమావేశమై తెలంగాణ పెండింగ్‌ అభ్యర్థుల గురించి మరోసారి చర్చించి తుది జాబితా ప్రకటిస్తారని సమాచారం.

ఫ ప్రచారానికి నెల రోజులే సమయం

ప్రచారానికి కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉండడం బీజేపీ, బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నెల రోజులుగా నియోజక వర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలలో రెండేసి సార్లు పర్యటించి సమావేశాలు నిర్వహించడం అన్ని హంగులు సమకూర్చుకోవడం పూర్తి చేశారు. అభ్యర్థిని ఆదివారం ప్రకటించినా అన్ని వ్యవస్థలు సమకూర్చుకోవడానికి వారం రోజులు పడుతుందని కేవలం 20 రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంటుందని ఆశావహులు ఆందోళన పడుతున్నారు. అధిష్ఠానం ఆఖరి క్షణం వరకు నాన్చుతూ వచ్చి తమను పోటీ చేయమని పేర్లు ప్రకటిస్తే ఏం లాభమనే అభిప్రాయాన్ని కూడా ఆశావహులు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తున్నది. అధిష్ఠానం చేస్తున్న జాప్యం పట్ల పార్టీ నేతలు, శ్రేణులు కూడా అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ప్రజలను కలవడం సాధ్యమవుతుందా ప్రచారం పూర్తి చేయగలుగుతామా అంటు వారు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో టికెట్‌ ఆశిస్తున్న వారు డీలా పడుతున్నారని సమాచారం.

Updated Date - Apr 14 , 2024 | 12:52 AM

Advertising
Advertising